04:16 PM, 28 Thursday January 2021

రైతులు శాస్త్ర సాంకేతిక పద్ధతులను ఉపయోగించి అధిక దిగుబడులు సాధించడానికే వైఎస్ఆర్ పొలంబడి… జిల్లా వనరుల కేంద్రం, ఆత్మ పి. డి, జి. సునీత…

రైతులు శాస్త్ర సాంకేతిక పద్ధతులను ఉపయోగించి అధిక దిగుబడులు సాధించడానికి వైఎస్ఆర్ పొలంబడి ఉపయోగపడుతుందని జిల్లా వనరుల కేంద్రం, ఆత్మ పి. డి, జి. సునీత పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి కె. ప్రభాకర్ ఆధ్వర్యంలో వైయస్సార్ పొలంబడి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రైతులు శాస్త్ర సాంకేతిక పద్ధతులను ఉపయోగించి అధిక దిగుబడులు సాధించడానికి వైఎస్ఆర్ పొలంబడి ఉపయోగపడుతుందని జిల్లా వనరుల కేంద్రం, ఆత్మ పి. డి, జి. సునీత పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి కె. ప్రభాకర్ ఆధ్వర్యంలో వైయస్సార్ పొలంబడి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యవేక్షించడానికి వచ్చిన జిల్లా వనరుల కేంద్రం, ఆత్మ పిడి, జి . సునీత రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు శాస్త్ర సాంకేతిక పద్ధతులను ఉపయోగించి, అధిక దిగుబడులు సాధించడానికి డాక్టర్ వైయస్ఆర్ పొలంబడి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇది 14 వారాలు వేసిన దగ్గర నుంచి పంట చేతికి అందే వరకు నిర్వహిస్తారని ఆమె తెలిపారు. ప్రతివారం వాతావరణ పరిస్థితులను అనుసరించి వారికి కావాల్సిన సలహాలు సూచనలు అందిస్తారని దీనికి మీ తోటి రైతులు కూడా తెలియపరచాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఎ డి కృష్ణ మాట్లాడుతూ ఎరువుల యాజమాన్యం గురించి, రైతులకు వివరించి అధికంగా ఎరువులు ఉపయోగించడం వల్ల పెట్టుబడి ఖర్చు పెరగడమే కాకుండా చీడపీడలు కూడా పెరిగే ఆస్కారం ఉందని అందువల్ల వ్యవసాయ సహాయకుల సూచనల మేరకు మాత్రమే ఎరువులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం పెద్దాపురం వ్యవసాయ అధికారి ఝాన్సీ రాణి, వ్యవసాయ సహాయకులు మణికంఠ, ఐశ్వర్య దేవి, తేజ, తులసీదాస్, హరిబాబు, రైతులు గారపాటి శ్రీనివాసరావు, ఈశ్వరరావు, కర్రీ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#