09:55 AM, 5 Friday March 2021

ర్యాలీ మంచినీటి కుళాయిలో బురద నీరు

– వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు
– గ్రామాల్లో మంచినీటి కుళాయిలు లో నుంచి వస్తున్న కలుషిత నీరు
– వ్యాధులు బారిన పడుతున్న ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి వదిలేయడంతో గ్రామ ప్రజల ఆవేదన

ఆత్రేయపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండలం ర్యాలి గ్రామంలో మంచినీటి కులాల నుంచి వస్తున్న  మురికి నీరు  వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు.రజక వీధి లో కలుషిత నీరు భారీగా మంచినీటి కుళాయిలు నుంచి వచ్చి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఈ మంచినీటి కుళాయిలు తాగడానికి పని చేయకపోయినా ఇంటిలో వాడుకోవడానికి కూడా  పని చేయటం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ కుళాయిలు నుంచి నీరు  డ్రైనేజీ బురద నీరు భారీగా వస్తుంది,ఈ సమస్య గత 18 నెలల  కిందట నెలకొంది అప్పటి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు సుబ్రహ్మణ్యం స్వామి  ఆలయం వద్ద ఉన్న నీళ్ల ట్యాంక్ ను  పరిశీలించి వాటర్ ట్యాంక్ లోకి నీళ్లు వెళ్లే పాడై ఉండవచ్చని నిర్ధారణ చేశారు. అయితే సంబంధిత అధికారులు అప్పటినుంచి కుళాయి నీరు మురుగా పచ్చగా వస్తున్న తూతూమంత్రంగా రిపేర్ చేసి వదిలేస్తున్నారు, తప్ప సమస్యకు పరిష్కారం చేయట్లేదు,  ర్యాలీ గ్రామపంచాయతీ కార్యదర్శి కృష్ణ దృష్టికి తీసుకెళ్లగా వాటర్ ట్యాంక్  క్లీనింగ్ చేస్తున్నామని అయితే వాటర్ పైపులు ఎప్పటివో కావడంతో తో తుప్పుపట్టి ఉండొచ్చని తొందర్లోనే పరిష్కారం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ నీరు వల్ల ఒంటికి దురదలు ఎలర్జీ విషజ్వరాలు వచ్చి బాధపడుతున్నాము అని ఈ సమస్య  ప్రత్యేక అధికారులు స్పందించి పరిష్కరించాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#