02:38 AM, 8 Monday March 2021

వడ్డిగూడెం రెబల్ సర్పంచ్ అభ్యర్థిగా రత్నకుమారి

– గతంలో అందరి మన్నన పొందిన సర్పంచిగా పేరు
– గెలిచే అవకాశాలున్నట్లు కొందరి అంచనా

వి.అర్.పురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండలంలోని గ్రామ పంచాయితీ ఎన్నికలకు నామినేషన్ పక్రియ కొనసాగుతున్న క్రమంలో వడ్డిగూడెం గ్రామ పంచాయితిలో వైసిపి తరుపున సోడి నర్సమ్మ పోటీ చేయుచున్న క్రమంలో అదే పార్టీ తరుపున రెబల్ సర్పంచ్ అభ్యర్థిగా సొంది రత్నకుమారి పోటీలో దిగారు. గతంలో ఈమె సర్పంచిగా చేసిన అనుభవం ఉన్నది. పంచాయితిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ననలు పొందినట్లు పంచాయితీ పరిధిలోని ప్రజలు అంటున్నారు. ఒక కార్యకర్త వలన తను రెబల్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు తెలిపారు. గెలుపు తజ్యమని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  వైసిపి పార్టీకి తాను వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. మన్యం టైగర్  జిల్లా  డిసిసిబి చైర్మన్ అనంత ఉదయ భాస్కర్ కి వడ్డిగూడెం గ్రామ పంచాయితీ గెలిచి అంకితం ఇవ్వనున్నట్లు తెలిపారు. తన గెలుపుకు పంచాయితిలోని వైసిపి కార్యకర్తలు, ఓటర్లు అందరూ సహకరించి ఓటు వేసి గెలిపించాలని కోరారు.  శనివారమే తాను నామినేషన్ పక్రియ ముగించుకొన్నానని అందరూ సహకరిస్తే పంచాయితీ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#