ఆత్రేయపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
కోనసీమ తిరుమల తిరుపతి వెంకన్న గా ప్రసిద్ధి గాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రాజనగరం ఎమ్మెల్యే రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ రమేష్ రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు పాలకమండలి సభ్యులు కలిసి ఘన స్వాగతం పలికారు అలాగే అర్చకులు పూర్ణకుంభంతో వేద మంత్రాలు చదువుతూ స్వామి వారి ఆలయంలో ప్రదక్షిణలు చేయించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామివారి చిత్రపటం నుంచి అభినందించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా స్వామివారి దర్శనం చేసుకుని మాట్లాడుతూ వాడపల్లి ఏడువారాల ఎంకన్న దర్శించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.