02:08 AM, 8 Monday March 2021

వికాస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో మినీ జాబ్ మేళా

కాకినాడ సిటి, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా కాకినాడ కలెక్టరేట్ లోగల వికాస కార్యాలయంలో పలు కంపెనీలలో ఉద్యోగా నిమిత్తం మినీ జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస పిడి లచ్చరావు మాట్లాడుతూ టెన్త్, డిగ్రీ, బీటెక్, బియస్సి, ఎంబీఏ లలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు హుండాయ్, ముత్తూట్, శ్రీకాళహస్తి పైప్ లైన్స్,ఇండిగో ఎయిర్లైన్స్ తదితర సంస్థల్లో వివిధ ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఉంటుందని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వికాస సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#