అంబాజీపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
నకిలీ కౌలు రైతు కార్డులతో రుణాలు పొందిన సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబాజీ పేట తాసిల్దార్ కార్యాలయం వద్ద తేదేపా శ్రేణులు మంగళవారం ధర్నా నిర్వహించారు. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు దంతులూరి శ్రీను రాజు, గూడాల ఫణి, మాజీ ఎంపీపీ దాసరి వెంకట సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ బొంతు పెదబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ అరిగెల బలరామమూర్తి,మందపాటి కిరణ్ కుమార్,లెనిన్ బాబు, ఎస్సీ సీనియర్ నాయకులు చిన్నం బాల విజయరావు, గంగ మల్ల వీరభద్రరావు, గంధం వెంకటేశ్వరరావు, వక్కలంక బుల్లియ్య, దువ్వూరి సురేష్,రవణం రాము, మాచవరం గ్రామ శాఖ కార్యదర్శి, క్రాప శ్రీను, యా గాన రాము, చిక్కం పళ్ళంరాజు, ఎర్రంశెట్టి బలరామమూర్తి, తెలుగు యువత అధ్యక్షులు పళ్ళ శ్రీను తదితరులు పాల్గొన్నారు.