ఏలేశ్వరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
మండలం ఎర్రవరం విజ్ఞాన జ్యోతి జూనియర్ కళాశాల లో 2018- 20 విద్యా సంవత్సరం లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్ధులు ఇంజనీరింగ్ లో అత్యుత్తమ ర్యాంక్ లు సాధించి,తల్లిదండ్రులకు ,కాలేజి యాజమాన్యానికి,శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులకు ప్రతిష్ఠ తీసుకొచ్చారని కళాశాల చైర్మన్ సి .హెచ్ .భద్ర లక్ష్మి ,కరస్పాండెంట్ చిట్రా నాగేశ్వరరావు,ప్రిన్సిపాల్ టి వి వి రమణ, యలమంచిలి శేఖర్, అధ్యాపక బృందం విద్యార్థులకు అభినందనలు తెలిపి మెమెంటో అందజేశారు .మహ్మద్ అబ్దుల్ భాషా ఖాన్ విజయ నగరం జే యన్ టి యు, పాండ్రీoకి దేవికా శ్రీ రాణి భీమవరం విష్ణు, గూడవిల్లి రాధా నాగ దేవి విజయనగరం జే యన్ టి యు ,మజ్జి జీవన్ కుమార్ రాజమండ్రి నన్నయ్య ,కాకాడ లక్ష్మీ మానస భీమవరం యస్ ఆర్ ఐ సి ఆర్,కర్ని కృష్ణ వేణి భీమవరం యస్ ఆర్ కె ఈ .ఇంజినీరింగ్ కళాశాలలో సీట్లు సాధించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆయా గ్రామాల పెద్దలు శుభాకాంక్షలు తెలిపారు.