04:52 PM, 3 Wednesday March 2021

“వినిమయ” లెక్చర్ క్లబ్ తో విజ్ఞాన వికాసం

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఎక్కువ విజ్ఞాన శాఖలకు సంబంధించిన పరిశోధనాంశాలను ఒక వేదికపైకి తీసుకురావడానికి, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో విజ్ఞానాన్ని వికసింపచేయడానికి “వినిమయ” లెక్చర్ క్లబ్ ను ఏర్పాటు చేసామని ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. విశ్వవిద్యాలయం కన్వేన్షన్ సెంటర్ లో శనివారం “వినిమయ” అనే పేరుతో లెక్చర్ క్లబ్ ను వీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు కేవలం పాఠ్యాంశాలను బోధించడం మాత్రమే కాకుండా విజ్ఞాన, వికాస కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని అన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాన్ని విజ్ఞాన వికాస కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వినిమయ లెక్చర్ క్లబ్ ను ఏర్పాటు చేసామని చెప్పారు. ఈ లెక్చర్ క్లబ్ లో నెలకు రెండు పర్యాయాలు విశ్వవిద్యాలయ ఆచార్యులు తమ పరిశోధనాంశాలపై లెక్చర్ ను అందిస్తారని తెలిపారు. ఎక్కువ విజ్ఞాన శాఖలకు సంబంధించిన పరిశోధనాంశాలు భవి పరిశోధకులు, అధ్యాపకులు తెలుసుకొని సృజనాత్మక పరిశోధనలవైపు అడుగులు వేసేందుకు ఈ లెక్చర్ క్లబ్ ఉపయోగపడుతుందని తెలియజేసారు. బోధన, పరిశోధన, మంచి సాధన తదితర అంశాలపై ఆసక్తిని పెంచేందుకు యువతరాన్ని పోత్సహించేందుకు లెక్చర్ క్లబ్ లు మార్గదర్శకాలుగా ఉంటాయన్నారు. లెక్చర్ క్లబ్ కోఆర్డినేటర్ డా.వి.పెర్సిస్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాన్ని విద్యాపరంగా, పరిశోధనపరంగా అభివృద్ధి చేసేందుకు వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు ప్రవేశపెట్టిన బృహత్తర కార్యక్రమం వినిమయ లెక్చర్ క్లబ్ అని తెలిపారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని విశ్వవిద్యాలయాన్ని పరిశోధన ప్రగతివైపు నడిపించాలనే వీసీ ఆలోచనలను సాకారం చేయాలని తెలియజేసారు. వినిమయ లెక్చర్ క్లబ్ లో తొలి లెక్చర్ ను సూక్ష్మఆర్థిక విధానం అనే అంశంపై యూనివర్సిటీ మాజీ రిజిష్ట్రార్ మేనేజ్మెంట్ ఆచార్యులు ఎస్.టేకి అందించారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలలో ప్రధానంగా దరిధ్రం, కాలుష్యం, ఉగ్రవాదమని వాటిని నియంత్రిస్తే దేశాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. స్థానిక వనరులను ఉపయోగించుకుంటూ పేద ప్రజలు, మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందడానికి ఉన్న మార్గాలను ఉదాహరణలతో వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఆచార్యులు, అధికారులు, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#