05:55 AM, 2 Tuesday March 2021

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రవేట్ పరం చేయటం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపునమేము వ్యతికేస్తున్నాం

– కె కె రాజు

విశాఖపట్నం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు అని అనేక మంది త్యాగాలు, పోరాటాలు ఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారంకు కేంద్ర ప్రభుత్వం ఘనులు కేటాయించి అన్ని విధాలుగా ఆదుకోవాలిసింది పోయి ప్రవేట్ పరం చేసి ప్రవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయటం పై వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు అన్నారు. . ఈ విషయం లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ను మేము పెద్ద ఎత్తున నిరశసిస్తున్నామని కె కె రాజు అన్నారు. ఈ విషయంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంతటి పొరాటలకైనా మేము సిద్దమ్మన్నారు. మేము ఉద్యోగుల సంఘాలకు, నిర్వాసితులకు మద్దత్తు గా నిలిచి వారికి ఎలాంటి సహాయం కావాలన్నా మేము వారికి మా సహకారాన్ని అందించేకు పోరాడేందుకు సిద్ధం గా ఉన్నామని , ఈ ఉక్కు కర్మాగారం ను యధావిధిగా కొనసాగేవరకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోరాటం చేస్తామని అన్నారు. ఉద్యోగులకు, నివాసితులకు భద్రతా కల్పిస్తూ ఆ ఫ్యాక్టరీ ని యధావిధిగా కొనసాగించాలని ఈ సందర్భంగా కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ను హెచ్చరిస్తున్నామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#