05:03 PM, 3 Wednesday March 2021

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా*

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా*

జగ్గంపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

జగ్గంపేట(విశ్వం వాయిస్ న్యూస్ ): స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి జగ్గంపేట తాసిల్దార్ కార్యాలయం వరకు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తున్నందుకు నిరసనగా నిరసనర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ చేసి ఉద్యోగస్తులను వీధుల పాలు చేయొద్దంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ సరస్వతి కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు మండల పార్టీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి అప్పలరాజు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా జగ్గంపేటలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆనాడు ఇతర రాష్ట్రాలు పోతున్న ఆనాడు ఇతర రాష్ట్రా నికి తరలి పోతున్న ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రులకు విశాఖ ఉక్కు అనే నినాదంతో సాధించుకుందామని ఇక్కడ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఉద్దేశంతో 33 వేల ఎకరాల రైతు ఇచ్చారని అదేవిధంగా ఉక్కు పరిశ్రమ అనేక వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది అన్నారు. ప్రైవేటీకరణ నే ఉద్దేశాన్ని విరమించకపోతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనేక నిరసన ప్రజా పోరాటాలు సాగిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాండ్రంగి రాంబాబు, కొత్త కొండ బాబు, పీలా మహేష్, పైడిపాల సత్యనారాయణ, కుదప వాసు, దేవరపల్లి మూర్తి, తుమ్మల కిషోర్, హరి గోపాల్, అనంతలక్ష్మి, బిక్కిన బాబి, మాజీ ఎంపిటిసి లు నూతన వార్డ్ నెంబర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#