– మహమ్మద్ ఆరిఫ్
అంబాజీపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం తగదని ఏపీసీసీ కార్యదర్శి మహమ్మద్ ఆరిఫ్ అన్నారు.
అంబాజీపేట మండల కాంగ్రెస్ సమావేశం ఏపీసీసీ బీసీ కో కన్వినర్ మాచవరపు శివన్నారాయణ నివాసంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నెల్లి వెంకటరమణ అధ్యక్షతన ఆదివారం జరిగింది.ఈ కార్యక్రమానికి ఏపీసీసీ కార్యదర్శి మహమ్మద్ ఆరిఫ్ ముఖ్య అతిధిగా మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రవేటీకరణ చేయడం సరికాదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో విశాఖ రైల్వే జోన్ మరియు విశాఖ -విజయవాడ ఇండస్ట్రియల్ కరిడార్ విభజన చటంలో ఉన్నాయని బీజేపీ ప్రభుత్వం అది అమలు చేయకుండా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మడం బీజేపీ ప్రభుత్వం చేతకాని తనం అన్నారు.
ఇలాంటి చర్యలను వైసీపీ ప్రభుత్వం ఆడుకోవాలని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం లో 32 మంది అమరుల అయ్యారని తెలిపారు.రాబోయే ఎన్నికలలో బీజేపీ,వైసీపీ ప్రభుత్వాలను గద్దె దింపాకపాలని ప్రజలను కోరారు.విశాఖ ఉక్కు పరిశ్రమ ను ప్రవేటీకరణ ఆడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లోకసభ,రాజ్యసభ,యం పిలు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమం లోడీసీసీ ప్రధాన కార్యదర్శి మూలపర్తి మోహనరావు, డీసీసీ కార్యదర్శి మహమ్మద్ ఇస్మాయిల్,మండల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆదుర్తి నారాయణ మూర్తి,పులిదిండి బాలయోగి తదితరులు పాల్గొన్నారు.