01:11 AM, 24 Sunday January 2021

వీసీ కి పూర్వవిద్యార్థుల అభినందనలు

రాజానగరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి ఐ.ఎస్.ఓ సర్టిఫికేషన్ ను సాధించిన ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు ను విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థులు సన్మానించి అభినందనలు తెలియజేసారు. మంగళవారం వీసీ కార్యలయంలో క్రీడాపరిశోధకులు, స్పృహసైకాలజీ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యాక్షులు సుంకర నాగేంద్ర కిషోర్, విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థి వైశ్య సేవా సాధనం నూతన అధ్యక్షులు గాదె కిషోర్ లు వీసీ ని మర్యాదపూర్వకంగా కలిసి విశ్వవిద్యాలయానికి ఐ.ఎస్.ఓ గుర్తింపును సాధించినందుకు సాలువాతో సన్మానించి అభినందించారు. ఉన్నత ప్రమాణాలు, విలువలతో విశ్వవిద్యాలయ సర్వతోముఖాభివృద్ధి ఆచార్య మొక్కా జగన్నాథరావు పాటుపడుతున్నారని కొనియాడారు. విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధిలోనికి తీసుకువెళ్ళాలని దానికి తమవంతు సహకారాన్ని అందిస్తామని వారు తెలిపారు. అలాగే ఇటీవల సుంకర భాస్కర రావు క్రీడా పరిశోధనాభివృద్ధి కేంద్రం తరుపున విద్యార్థులలో శారీరక, మానసిక సమాతుల్యత, ఆరోగ్యకర జీవన విధానం పెంపుదలకు చేపట్టిన కార్యక్రమాలను వీసీ కి వివరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థుల చదులుతో పాటు శారీరక, మానసిక, సాంఘిక, ఆరోగ్యాభివృద్ధికి ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. సమాజం హితం కోసం ఆయా సంస్థలు చేస్తున్ కార్యక్రమాలను వీసీ ప్రసంసించారు. ఈ నూతన సంవత్సరంలో మరిన్ని మంచి కార్యక్రమాలను నిర్వహించాలని తెలియజేసారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#