08:58 AM, 3 Wednesday March 2021

వెంకటరెడ్డిపేట గ్రామపంచాయతీ ఏకగ్రీవం

– సర్పంచ్ గా కొమరం.ఫణీశ్వరి ఎన్నిక
– ఆర్వో చేతుల మీదుగా పత్రం అందజేత

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండలంలోని వెంకటరెడ్డిపేట గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. సర్పంచ్ అభ్యర్థిగా (ఎస్టీ కేటగిరీ) పోటీలో ఉన్న కొమరం.ఫణీశ్వరి ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఈ మేరకు చోడవరం గ్రామపంచాయతీ – ఎర్రగట్టు సచివాలయంలో శుక్రవారం రిటర్నింగ్ అధికారి (స్టేజ్ – 1 అధికారి) ఎం.గణేశ్వరరావు చేతుల మీదుగా వెంకటరెడ్డిపేట గ్రామపంచాయతీ ఏకగ్రీవమైనట్టు సర్పంచ్ గా నియామక పత్రాన్ని అభ్యర్థి కొమరం.ఫణీశ్వరి అందుకున్నారు. అంతేకాకుండా 3 వార్డులు సైతం ఏకగ్రీవం కావడం గమనార్హం. అయితే ఈ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం భారీగా ఆర్థిక తోడ్పాటును అందించనుంది. ఈ ప్రోత్సాహక మొత్తాన్ని గతంలో రెండు కేటగిరీలుగా అందివ్వగా ఈసారి నాలుగు స్లాబుల్లో విభజించింది. జనాభాను బట్టి కనిష్ఠంగా రూ.5 లక్షలు, గరిష్ఠంగా రూ.20 లక్షలు సంబంధిత గ్రామ పంచాయతీకి అందించనుంది. అయితే వెంకటరెడ్డిపేట గ్రామపంచాయతీ మండలంలోనే 21 పంచాయతీల్లో తక్కువ జనాభా కలిగిన గ్రామపంచాయతీ కావడంతో ప్రభుత్వం నుండి రూ.5 లక్షలు ఆర్ధిక తోడ్పాటు అందుకోనుంది. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డిపేట గ్రామపంచాయతీ కార్యదర్శి జంపన్న , రాయనపేట గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ , చోడవరం గ్రామపంచాయతీ కార్యదర్శి మౌనిక , వీఆర్వోలు జెట్టి.రామకృష్ణ , వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#