ఆత్రేయపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
వెలిచేరు లంకలో సుమారు 7 వేల 3వందల బారి బెల్లపు వూటను కొత్తపేట ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. ఎక్సైజ్ సీఐ చలం తెలిపిన వివరాల ప్రకారం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా అధికారి సుమిత్ సునీల్ గరుడ, స్పెషల్ బ్యూరో కాకినాడ అయినా ఎం జయరాజు ఆదేశాల మేరకు తమ సిబ్బందితో గుట్టుచప్పుడు కాకుండా వెలిచేరు గోదావరి లంక గ్రామాల్లో దాడులు నిర్వహించడం జరిగిందని ఈ దాడుల్లో బయటపడిన సుమారు 7300 బెల్లం ఊటను ధ్వంసం చేసి వాటికి సంబంధించిన డ్రమ్ము లను స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. అలాగే లంక గ్రామాలు కాగా ఎక్కడైనా సార్ తీసినట్టు తెలిసినచో పోలీసువారికి సమాచారం అందించి సహకరించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సి ఐ కోరారు.