06:40 AM, 4 Thursday March 2021

వైసీపీలో టీడీపీని మించిన వెన్నుపోటు….

– వైసీపీ పార్టీ తరుపున నామినేషన్ వేసిన వ్యక్తి ఆత్మహత్యా యత్నం….

ప్రకాశం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

కురిచేడు మండలం ప్రతిజ్ఞాపురి గ్రామానికి చెందిన ఎస్టీ మహిళ చలంచర్ల హైమావతి వైసిపి పార్టీ తరఫున గ్రామ సర్పంచ్ గా నామినేషన్ వేశారు.అదే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ తరుపున నామినేషన్ వేశారు. గ్రామంలో వైసీపీ తరుపున హైమావతి ప్రచార కార్యక్రమాలు చేసుకుంటున్న తరుణంలో అదే గ్రామానికి చెందిన కొందరు టిడిపి పార్టీకి చెందిన కార్యకర్తలు ఈరోజు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సమక్షంలో చేరినారు. అనంతరం వాళ్ళు వైసీపీ పార్టీ తరుపున ప్రచారాలు మొదలుపెట్టారు. ఈ తరుణంలో అధికార పార్టీ నాయకులు ఒకరిని రెండు సంవత్సరాలు మరొకరిని మూడు సంవత్సరాలు చేసుకోవాలని సూచించడంతో మొదటి నుండి మేము వైసీపీ పార్టీని కనిపెట్టుకొని ఉంటే మాకు వెన్నుపోటు పొడిచారు అని కలత చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన హైమావతి ని హుటాహుటిన స్పందించిన గ్రామస్తులు కురిచేడు హాస్పిటల్ కి తరలించారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#