09:36 PM, 1 Monday March 2021

శహపురంలో చివరి రోజు జోరుగా సాగిన ప్రచారం

– కుక్కర్ గుర్తు కు ఓటు వేయాలని అభ్యర్థి విమల కుమారి అభ్యర్థన
– ప్రచారంలో అడుగడుగునా జన నీరాజనం

పెదపూడి, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండలంలో గ్రామ గ్రామాన పంచాయతీ ఎన్నికల జోరుగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం పెదపూడి మండలం, శహపురం గ్రామంలో వార్డు సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాజంగి వెంకటరమణ బలపర్చిన 7వ వార్డు మెంబర్ అభ్యర్థిని వల్లూరి విమల కుమారి తనదైన శైలిలో కుక్కర్ ఫ్లకార్డు లతో ఎన్నికల ప్రచారం చేశారు. శహపురం 7వ వార్డులో ఇంటింటికీ తిరిగి కుక్కర్ గుర్తు పై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేసారు….ఈ సందర్భంగా వార్డు మెంబర్ అభ్యర్థిని విమల కుమారి మాట్లాడుతూ ఓటర్లు కుక్కర్ గుర్తు పై ఓటు వేసి తనను,,,,,మంచం గుర్తు పై ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థిని గాజంగి సూర్యకాంతం వెంకటరమణని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుల, మత, పార్టీలకతీతంగా అమలు చేసిన సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని తమకు ఓటు వేసి గెలిపించాలన్నారు. తాము గెలిస్తే శహపురం గ్రామాన్ని జిల్లాలొనే ఆదర్శగ్రామంగా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వల్లూరి చిన్నారి, సత్యవేణి, లక్ష్మి, అప్పయ్యమ్మా,మార్తమ్మా,  బేబీ, వి సత్య వేణి,భూషణం,పీ మరియమ్మ, సత్యనందం, ఏసు, బాబురావు, సత్తిబాబు, రాజు, జైరాజు, పండు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మద్దత్తుదారులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#