05:41 PM, 1 Monday March 2021

శాంతి, అహింసలకు గొప్ప చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడుతున్న వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ

– రాయవరం ఎం పి డి వో మల్లపురెడ్డి.

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

జాతిపిత మహాత్మా గాంధీ నేతృత్వంలోని అహింసా ఉద్యమం ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిందని రాయవరం ఎం పి డి వో మల్లపురెడ్డి శ్రీను అన్నారు.
మండల కేంద్రమైన రాయవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో  73 వ  వర్ధంతి పురస్కరించుకుని ఎం పి డి వో మల్లపురెడ్డి శ్రీను  జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన  నివాళ్ళు అర్పించారు. ఈ నేపధ్యంలో ఎం పి డి వో  శ్రీను మాట్లడుతూ ఎందరో మహనీయిల త్యాగఫలితంగా భారతావని ఇప్పడు స్వతంత్ర దేశంగా ఫరిడవిల్లుతుందని, ఇటు సైనికపరంగా, అటు ఆర్థికంగా ప్రపంచంలోనే ముఖ్య శక్తిగా అవతరించిందన్నారు. మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపున‌కు స్పందించిన దేశ ప్రజలు నాటి శక్తివంతమైన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేసారు. భారతదేశం వదిలి పోవాలని గాంధీజీ బ్రిటిష్ వారిని కోరినప్పుడు శాంతియుత మార్గాలలో బ్రిటిష్ పాలకులను దేశం నుండి తరిమికొట్టవచ్చని నమ్మలేదని ఎం పి డి వో అన్నారు. అనేక దేశాల నాయకులు మహాత్మా గాంధీని అనుకరించి,  వారి స్వేచ్ఛా ఉద్యమాలలో అహింస, సత్యాగ్రహ సూత్రాలను పాటించటం ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు. శాంతి, అహింసలకు గొప్ప చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడుతున్న జాతిపిత మహాత్మా గాంధీని దేశ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని వివరించారు.  కేవలం అహింస మాత్రమే దేశానికి స్వేచ్ఛా వాయివులు ప్రసాదించగలదని మహాత్మా గాంధీ  విశ్వసించేవారని అన్నారు. దేశ స్వేచ్ఛ కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన వారందరి జ్ఞాపకార్థం, మహాత్ముడికి గౌరవార్ధం ఎం పి డి వో శ్రీను, సిబ్బంది రెండు నిమిషాల మౌనం పాటించారు.  ఈ కార్యక్రమంలో పంచాయితీ విస్తరణ అధికారి బి అశోక్ కుమార్,  ఆర్ డబ్ల్యూ యస్ జే ఈ చైతన్య కుమారి,  పరిపాలన అధికారి ఎం హరిక్రిష్ణ రెడ్డి, వెంటూరు పంచాయితీ కార్యదర్శి డి. శ్రీనివాస్ తదితరలు ఉన్నారు

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#