వి.అర్.పురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
మండలం నుండి మొట్ట మొదటి సిపియం సర్పంచ్ అభ్యర్థి ని సిపియం మండల కమిటీ శనివారం ప్రకటించడం జరిగింది. మండల సిపియం కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామగిరి గ్రామ పంచాయితీ లో శనివారం ఆ పంచాయితీ గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. పులి సంతోష్ ని సర్పంచ్ అభ్యర్థిగా ఖరారు చెయ్యడం కొరకు పలువురితో చర్చించి తుది నిర్ణయం మండల కమిటీ తీసుకున్నది. మాజీ ఎంపిపి కారం శిరమయ్య సంతోష్ కి ఎర్ర కండువ కప్పి గ్రామ పంచాయితీ గ్రామస్థుల సమక్షంలో సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారు.
తండ్రి బాటలో తనయుడు
గతంలో కుంజా బొజ్జి భద్రాచలం నియోజక వర్గంలో యంయల్యే గా ఉన్న సమయంలో పులి ధర్మరాజు సర్పంచ్ గా విధులు నిర్వహించారు. మాజీ సర్పంచ్ ధర్మరాజు వారసుడైన అతని తనయుడు పులి సంతోష్ 2021 వచ్చే నెలలో జరగ బోయే సర్పంచ్ ఎన్నికల్లో రంగంలోకి దిగారు. సంతోష్
విద్యావంతుడు, యస్ యఫ్ ఐ సంఘంలో విధ్యార్ధుల సమస్యల కోసం పాటుపడిన వ్యక్తి. ఎన్నో పార్టీ కార్యకలాపాలలో పాల్గొని ప్రజలకు దగ్గరగా ఉండి ఎటువంటి పదవులను ఆశించకుండా పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తి అని ఆ పంచాయితీ పరిధిలో ని ప్రజలు అంటున్నారు. నేడు ముంపు మండలాల్లో ప్రధాన మైన పోలవరం ప్రాజెక్టు విషయంలో నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులు గురించి అవగాహన కలిగిన వ్యక్తి. పదవులు లేనప్పుడే ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తికి పదవి ఇస్తే ప్రజలకు మరింత సేవలు అందించే అవకాశాలున్నాయని మండల సిపియం పార్టీ, అక్కడి గ్రామ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. నేడు పోలవరం సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి , గ్రామాభివృద్ధి కి అన్ని విధాలా సహకారం అందించగల వ్యక్తి కాబట్టి సర్పంచ్ పోటీలో సిపియం నుండి పోటీలో దించుతున్నారు. ఈ సంధర్బంగా మండల సీపీయం నాయకులు శ్రీరామగిరి గ్రామ పంచాయితిలో గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.