10:29 AM, 16 Saturday January 2021

సంక్రాంతి సందర్భంగా ముందస్తు తనిఖీలు

◘ కోడి కత్తులు, గుండాట బోర్డులు స్వాధీనం
◘ చట్టం ఉల్లంగిస్తే కఠిన చర్యలు

పెనుమంట్ర, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ నాయక్ నేతృత్వంలో, నరసాపురం ఎస్ బి పి ఓ డి వి రామాంజనేయరెడ్డి పర్యవేక్షణలో పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.సునీల్కుమార్ ముందస్తు తనిఖీలు చేపట్టారు.పెనుమంట్ర మండలం పరిధిలో లో రాబోవు సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, గుండాట, పేకాట ఆడు వారిపై నిఘా పెట్టగా గురువారం రాత్రి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు చేయగా కడజారి సహదేవుడు s/o కాసులు, అను బ్రమ్మణ చెరువుకు చెందిన అతని ఇంటిలో కోడిపందాల కోసం  సిద్ధంగా ఉంచుకున్న 77 కోడి కత్తులు సీజ్ చేయటం జరిగింది. అదే గ్రామానికి చెందిన దొంగా నరసింహారావు s/o భగవందస్ అను అతని పొలం దగ్గర గల షేడ్ లో గుండట కి చెందిన 6 బోర్డ్స్ నీ, 24 బల్లలను,6 స్టూల్ లను వశపరుచుకుని సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేయటం జరిగింది మరియు పెనుగొండ సర్కిల్ పరిధిలో ఇరగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 35 కత్తులను సీజ్ చేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా సిఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో కోడి పందేలు , పేకాట , గుండాట మరియు ఎటువంటి జూదములకు అనుమతులు లేవు.  ముందుగా లాడ్జ్ రూమ్స్ /గెస్ట్ హౌస్ రూమ్ బుకింగ్ చేసుకున్న వారు కేవలం కోడిపందేలు,  గుండాట మరియు జూదము కొరకు వచ్చేటట్లు  ఉంటే దయచేసి రావద్దు, మీ బంధువులకు స్నేహితులకు కూడా తెలియజేయండి. జిల్లాలో కోవిడ్ వేవ్ దృష్ట్యా మరియు బర్డ్ ఫ్లూ వచ్చే  అవకాశాలు ఉన్న దృష్ట్యా రావద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు సదుద్దేశంతో పండుగకు పశ్చిమగోదావరి జిల్లా వచ్చినట్లయితే పశ్చిమగోదావరి పోలీసు వారు సంతోషంగా స్వాగతం పలుకుతాము. ఇక్కడికి   వచ్చిన తరువాత చట్టాన్ని అతిక్రమించినట్లయితే కఠిన చర్యలు తప్పవు మరియు మీ మీద పోలీస్ క్రిమినల్ కేసులు పెట్టబడతాయి.మీరు  చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అయిన జూదము, పేకాట, కోడి పందేలు కొరకు వచ్చినట్లయితే  మీ పైన ఇన్కమ్ టాక్స్ రైడ్స్ కూడా నిర్వహించబడతాయి.అందువలన మీరు మీ కుటుంబ సభ్యులతో పండుగ ఇంటివద్దనే జరుపుకోవాలని కోరుకుంటూ కేవలం కోడిపందాలు ,పేకాట ,గుండాట కొరకు ప్రత్యేకంగా పశ్చిమగోదావరి రావాల్సిన అవసరం లేదని చెబుతూ ఒకవేళ వచ్చే ఉద్దేశం ఉంటే ఆ ఆలోచన మానుకుని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని పశ్చిమగోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం కోరుకుంటూ సాంప్రదాయ సంక్రాంతికి నాంది పలకాలని కోరుకుంటున్నాము. ఈ సమావేశంలో సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ ఎన్ వి వి రమేష్ సిబ్బంది పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#