సంక్షేమ పథకాలే ఎన్నికల్లో తాను నిలబడటానికి స్ఫూర్తి
– ఎటపాక వైసిపి సర్పంచ్ అభ్యర్థి కాకా.వెంకటేశ్వరరావు
ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేటి పంచాయతీ ఎన్నికల్లో తాను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడటానికి స్ఫూర్తి అయ్యాయని ఎటపాక వైసిపి సర్పంచ్ అభ్యర్థి కాకా.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఎటపాక గ్రామపంచాయతీ పరిధిలో వైసిపి తరుపున తనకు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడేందుకు ప్రాధాన్యత ఇచ్చినందుకుగానూ తాను జిల్లా డిసిసిబి చైర్మన్ అనంత ఉదయ భాస్కర్ (బాబు) కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సర్పంచ్ అభ్యర్థి కాకా.వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఎటపాక గ్రామపంచాయతీలో వైసిపి తరుపున తనను నిలబెట్టినందుకు వైసిపి గ్రామశ్రేణులకు సైతం ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైసిపి సర్పంచ్ అభ్యర్థిగా కాకా.వెంకటేశ్వరరావు ఎటపాక నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అలాగే నామినేషన్ల స్వీకరణకు సోమవారం ముగింపు రోజు కావడంతో ఎటపాక పంచాయతీలోని 12 వార్డులకు 12మంది వైసిపి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి కాకా.వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ గ్రామపంచాయతీలోని ఓటర్లు అందరూ తమకు ఓటు వేయాలని ఆయన కోరారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మనసును గెలుచుకున్నారని పేర్కొన్నారు. కాబట్టి తనను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే ముఖ్యమంత్రి బాటలోనే గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులు చేపట్టి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తానని సర్పంచ్ అభ్యర్థి కాకా.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలో ఉన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కావున గ్రామప్రజలందరూ తనకు ఓటు వేసి గెలిపించాలని వైసిపి సర్పంచ్ అభ్యర్థి కాకా.వెంకటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా కార్యదర్శి కొవ్వూరి.రాంబాబు , జిల్లా నాయకులు కురినాల.వెంకటేశ్వర్లు (బుజ్జి) , కాకా.చిట్టిబాబు , ముర్రం.ముత్తయ్య , సీనియర్ నాయకులు శీలం.కృష్ణ , మండల నాయకులు బర్ల వెంకటరత్నం , మండల యూత్ నాయకులు దాసరి నరేష్ , మాచర్ల. బాబూరావు , సంతపూరి.వెంకటేశ్వర్లు , గజ్జల.శ్రీను తదితరులు పాల్గొన్నారు.