03:35 AM, 20 Wednesday January 2021

సందేహం

అనగనగా ఒక రోజు ఒక బడిలొ బాలుడికి ఒక సందేహం వచ్చింది. అతని గురువుని వెళ్ళి అడిగాడు – “గురువుగారు, ఎక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా?” గురువుగారు చిరునవ్వుతొ ఈ జవాబు చెప్పారు. “కప్పకూత రాత్రి-పగలు వినిపిస్తూనే వుంటుంది, అయినా దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. కాని కోడి ఒక్కే ఒక్క సారి కూస్తే ఊరంతా నిద్ర లేస్తుంది. దీని వల్ల అర్ధమయ్యేది యేమిటంటే, ఎయెక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు. మాట్లాడేది ఒక మాటే అయినా, అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు.” సందేహం తీరిన కుర్రవాడు సంతోషంగా వెళ్ళాడు.

Source : https://kathalu.wordpress.com/

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#