03:12 AM, 24 Sunday January 2021

సచివాలయాల పనితీరు అభినందనీయం

– మంత్రి విశ్వరూప్

అల్లవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ప్రజా సమస్యల పరిష్కారంలో గ్రామ,వార్డు  సచివాలయాలు పనితీరు అభినందనీయమ ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. మంగళవారం మంత్రి అల్లవరం మండలం దేవగుప్తంలో 79 లక్షలతో  నూతనంగా నిర్మించే గ్రామ సచివాలయానికి, రైతు భరోసా కేంద్రానికి, వెల్ నెస్ సెంటర్ కు  శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు తమకు సంభందించిన ప్రతీ సమస్యను గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా సత్వర పరిష్కారం పొందవచ్చునని అన్నారు. గ్రామ,వార్డు సచివాలయాల్లో అన్ని సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఇందుకు వివిధ శాఖల సిబ్బందిని నియమించడం జరిగిందనీ మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధనాల వెంకటరావు, కోనుకు బాపూజీ, ఇళ్ళ శేషారావు, ఏఎంసి చైర్మన్ బొక్కా ఆదినారాయణ, వైస్ చైర్మన్ బాబి, ఎంపిడిఓ ఎం రాఘవులు, మండల తహసీల్దార్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఎంట్రికోన లో 25 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే ఎంట్రికోన, దేవగుప్తం,డి.రావులపాలెం గ్రామాలకు చెందిన 490 మందికి మంత్రి ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#