10:20 AM, 16 Saturday January 2021

సచివాలయ, ఆర్ బికె, హెల్త్ సెంటర్ల నిర్మాణ పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదు

– జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

భవనాల నిర్మాణాల్లో నిధులు ఉన్నప్పటికి పనులు జరగకపోతే ఉపేక్షించేది లేదు. పనుల పర్యవేక్షణకు త్వరలో డివిజనల్ స్థాయి సమావేశాలు – ఇంకా పనులు చేపట్టని భవన నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలి — జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి సచివాలయ, ఆర్ బికె, హెల్త్ సెంటర్ల భవనాల నిర్మాణాల పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో విధాన గౌతమీ సమావేశ మందిరంలో జిల్లాలోని పంచాయితీ రాజ్ ఇంజనీర్లు, జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి తో కలసి కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఉపాధిహామీ నిధులతో అమలు జరుగుతున్న సచివాలయ, ఆర్ బి కె, హెల్త్ సెంటర్ల భవనాల నిర్మాణపు పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1248 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలకు అనుమతులు జారీ చేయడం జరిగిందన్నారు. 468.40 కోట్ల రూపాయలు పరిపాలన పరమైన అనుమతులు జారీ చేయడం జరిగిందన్నారు. ఇంకా ఇప్పటి వరకు 512 సచివాలయాల భవనాల పనులు ప్రారంభం కాలేదని, వారం రోజుల్లో బేస్ మెంట్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఇంజనీర్లకు ఆదేశించారు. 50 శాతం వరకు పనులు పూర్తికాని మండలాల్లో ఇతర ఇంజనీరింగ్ పనులు తన అనుమతి లేకుండా చేపట్టవద్దని కలెక్టర్ ఆదేశించారు. ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ సహయకుల సహాకారంతో మార్చి 31 వ తేదీ నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. పనులు పర్యవేక్షణకు త్వరలో డివిజనల్ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. రిపబ్లిక్ డే జనవరి 26 వ తేదీన మండలానికి ఒక భవనం ప్రారంభించే విధంగా పనులు చేయాలన్నారు. ఆ భవనాల పై ఆరోజు జాతీయ జెండా ఎగురవేసే విధంగా కార్యచరణ రూపొందించుకోవాలని కలెక్టర ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. పనులు జరిగిన వెంటనే ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేసి ఏజెన్సీలకు విశ్వాసం కల్పించే విధంగా వారు చేసిన పనులకు బిల్లులు చెల్లించే విధంగా పనిచేయాలన్నారు. జిల్లాలో కొన్ని గ్రామాల్లో స్థానికుల సహకారంతో మంజూరు అయిన నిధుల కంటే ఎంతో ఆహ్లాదకంమైన భవనాలను నిర్మిస్తున్నారన్నారు. అలాంటి భవనాలను స్పూర్తిగా తీసుకొని స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించి వినూత్న రీతిలో గ్రామ సచివాలయాల భవనాలు నిర్మించే విధంగా పంచాయితీ రాజ్ ఇంజనీర్లు కృషి చేయాలన్నారు. దీని కోసం స్థానిక ప్రజా ప్రతినిధుల సహాకారం తీసుకోవాలన్నారు. గ్రామంలో నివశించే వారు ప్రతి ఒక్కరు గ్రామ సచివాలయానికి వెళతారని ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దిశగా పనులు జరగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లాలో గృహ నిర్మాణ పట్టాల జారీలో 8000 ఎకరాలు సేకరించి లే అవుట్ వేసి పట్టాలు అందించడం ద్వారా లబ్ధిదారులల్లో కన్పిస్తున్న ఆనందం అదికారయంత్రాంగం పని తీరుకు నిధర్శనంగా నిలుస్తుందన్నారు. అదే స్ఫూర్తితో సచివాలయ, ఆర్ బి కె, హెల్త్ సెంటర్ల భవనాల పనులు చేపట్టి గ్రావస్తుల మన్ననలు పొందాలన్నారు. పనుల పర్యవేక్షణలో మండల స్థాయిలో గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ సహాయకులతో నిరంతరం టెలికాన్ఫరెన్సులు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నవరత్నాల్లో ప్రధానమైన గ్రామ సచివాలయాల భవన నిర్మాణపు పనులు పట్ల ప్రత్యేక దృష్టి వున్నందున ఆదిశగా పనులు జరగాలని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి పంచాయితీ రాజ్ ఇంజనీర్లకు దిశ దశ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పంచాయితీ ఎస్.ఇ నాగరాజు, ఇఇ, డిప్యూటీ డిఇ లు, ఏఇలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#