01:38 AM, 24 Sunday January 2021

సమస్య పరిష్కారం కాకుంటే.. ఉద్యమం నిర్వహిస్తాం…

– ఎపి ఎమ్మార్పీఎస్ఎస్ మద్దతు…

మండపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

అన్ని సక్రమంగా ఉన్న వారికి ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం  వికలాంగులుగా విషయంలోనూ ఉదారంగా స్పందించి ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక లు బుంగ సంజయ్ మాదిగ,  డిమాండ్ చేశారు. మండపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద వికలాంగులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని వారు సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వికలాంగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆందోళనను రాష్ట్ర వ్యాప్తంగా ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వికలాంగుల విషయంలో నిబంధనలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ మానవత్వం తో స్పందించాలని కోరారు. వివాహంతో సంబంధం లేకుండా 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. గతంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మండపేట పురపాలక సంఘంలో 4 శాతం నిధులు వికలాంగుల నిమిత్తం ఖర్చు చేసి విధంగా తీర్మానించడం జరిగిందన్నారు. ప్రస్తుతం అది అమలుకు నోచుకోకపోవడం బాధాకరమని అన్నారు. మండపేటలో ఈ తీర్మానం అమలయ్యే విధంగా నాయకులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోఎం ఆర్ పి ఎస్  నాయకులు బుంగ సునీల్ దత్, దొడ్డిపట్ల హరి, తాతారావు, కొమ్ము సతీష్, కొమ్ము సందీప్,  తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#