04:44 PM, 3 Wednesday March 2021

సిఎస్ ఆదిత్యానాధ్ ను కల్సిన ఆంధ్రా సబ్ ఏరియా మేజర్ జనరల్ ఆర్కె సింగ్

– ఇంటిగ్రేటెడ్ డిఫెన్సు కాంప్లెక్సుల నిర్మాణానికి స్థలం కేటాయించాలని విజ్ణప్తి
– 18న తిరుపతిలో జరిగే బంగ్లా యుద్ధం పూర్తయి 50యేళ్ళు స్వర్ణోత్సవాలకు ఆహ్వానం
– ఎపిలో మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి వివిధ సంస్థలు ఏర్పాటుకు కృషి

అమరావతి, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఆంధ్రా సబ్ ఏరియా మేజర్ జనరల్ ఆర్ కె సింగ్(జనరల్ ఆఫీసర్ కమాండింగ్)శుక్రవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ ను కలిశారు. భారత్-బంగ్లాదేశ్ యుద్ధం పూర్తయి 50యేళ్లు పూర్తయిన సందర్భంగా భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 18న తిరుపతిలో నిర్వహించనున్న స్వర్ణోత్సవ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్య అతిధిగా ఆహ్వానించామని ఆకార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ ను కూడా పాల్గొన వలసిందిగా ఆయన ఆహ్వానించారు. అదే విధంగా రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఇంటిగ్రేటెడ్ డిఫెన్సు కాంప్లెక్సుల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని ఆర్ కె సింగ్ సిఎస్ తో భేటీ సందర్భంగా విజ్ణప్తి చేశారు. మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి సంబంధించిన కార్యాలయాలన్నీ హైదరాబాదుకే పరిమితమైనందున ఎపిలో కూడా అన్ని జిల్లాల్లో తగిన వసతులు కల్పించేందుకు ఈఇంటిగ్రేటెడ్ డిఫెన్సు కాంప్లెక్సుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే కృష్ణా జిల్లాలో ఇంటిగ్రేటెడ్ డిఫెన్సు కాంప్లెక్సు నిర్మాణానికి విజయవాడ సమీపంలో బందరు రోడ్డులో స్థలాన్ని గుర్తించడం జరిగిందని దానిని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ కు ఆర్కె సింగ్ విజ్ణప్తి చేశారు.

మాజీ సైనికోద్యోగులకు తగిన సేవలందించేందుకు వీలుగా ప్రతి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ డిఫెన్సు కాంప్లెక్సులను నిర్మించదలిచామని అందుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలాను కేటాయిస్తే రక్షణశాఖ నుండి అవసరమైన నిధులు మంజూరు చేయించి వాటిని నిర్మిస్తామని ఆంధ్రా సబ్ ఏరియా మేజర్ జనరల్ ఆర్కె సింగ్ సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ కు వివరించారు. ఈఇంటిగ్రేటెడ్ డిఫెన్సు కాంప్లెక్సుల్లో డిఫెన్సు క్యాంటీన్,వెటర్నన్స్ ఆసుపత్రి,జిల్లా సైనిక సంక్షేమ బోర్డు,సైనిక్ అతిధిగృహం వంటివి నిర్మించండం జరుగుతుందని చెప్పారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ డిఫెన్సు కాంప్లెక్సుల నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించి కేటాయించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాటి నిర్మాణానికి అవసరమైన నిధులను రక్షణ శాఖ నుండి మంజూరు చేయించాలని కోరారు.అవసరమైన స్థలాలు కేటాయిందుకు సంబంధించి జిల్లా కలక్టర్లకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని సిఎస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సైనిక,మాజీ సైనికుల సంక్షేమానికి సంబంధించిన సేవలను పూర్తి స్థాయిలో విస్తరించి అందుబాటులోకి తెచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ మేజర్ జనరల్ ఆర్కె సింగ్ కు సూచించారు.

అంతకు ముందు మేజర్ జనరల్ ఆర్కె సింగ్ రక్షణశాఖ జ్ణాపికను సిఎస్ కు అందించగా ప్రభుత్వం తరుపున సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ ఆర్కె సింగ్ కు పుచ్చగుచ్చాన్ని అందించి బొబ్బిలి వీణను బహూకరించి దుశ్శాలువతో ఘణంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో రిటైర్డ్ కల్నల్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#