10:14 AM, 16 Saturday January 2021

సిట్ ఏర్పాటు చేయడంపై సీయం జగన్ కు కృతజ్ఞతలు

– పాష్టర్.తిమోతిరాజు

పెనుమంట్ర, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

దేవాలయ,చర్చీలపై దాడుల నేపథ్యంలో సిట్ ఏర్పాటు చేయడంపై సీయం జగన్ కు కృతజ్ఞతలు చెబుతూ,నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.మాకు  క్రిస్టియన్ కన్వర్షన్ చేయడం ఎంత మాత్రము ఉద్దేశం లేదు.యేసు అంటే మతం కాదు మార్గం మాత్రమే అని, కేవలం రాజకీయాల మనుగడ కోసం క్రైస్తవుల మీద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన దుష్ప్రచారానికి ఖండిస్తున్నామనీ యన్.సీ.సీ రాష్ట్ర కోకన్వీనర్ గాదిరాజు తిమోతిరాజు  అన్నారు.క్రైస్తవులపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన  అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నేషనల్ క్రిష్టియన్ కౌన్సిల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు  డేవిడ్ రాజు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు చంద్రబాబు క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలలో చర్చిలోకి వచ్చి ఎందుకు బైబిలు పఠనం చేయాలి అంటే క్రైస్తవులను మోసపుచ్చి నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది.మత విద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబుపై సుమోటోగా కేసు నమోదు చేయాలనీ డేవిడ్ రాజు డిమాండ్ చేశారు. ఎన్సీసీ నియోజకవర్గ కన్వీనర్ గెడ్డం చంద్రబాబు శామ్యూల్ జాన్సన్  మాట్లాడుతూ  రాజకీయాలకు మత విద్వేషాన్ని రెచ్చగొట్టి కుల మత వర్గ వైషమ్యాలను పెంచి పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.యన్.సీ.సీ మీడియా వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు గుత్తుల సాల్మన్ దొర మాట్లాడుతూ  నిజానిజాలు వెలికితీసి,మా హైందవ, క్రైస్తవ సోదరులకు మనస్తాపం కలిగించేలా దేవాలయాల,చర్చీలపై దాడులు చేసిన వారిని గుర్తించి మరోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి కఠినంగా శిక్షించాలన్నారు. సమావేశంలో పొలమూరి శేఖర్ బాబు,ఇంజేటి డేవిడ్,యల్లమెల్లి శామ్యూల్ ఫిన్ని, యం.విశ్వాసకుమార్ తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#