11:30 PM, 15 Friday January 2021

సీఎం జగన్ పాలన దేశానికే ఆదర్శం

– పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం
– దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇంటి పట్టా ఇస్తాం
– గండ్రేడు, పుట్టకుండ, శహపురం గ్రామాల్లో పట్టాల పంపిణీ
– అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి

పెదపూడి, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

పేదల సొంతింటి కలను సాకారం చేసే మహోన్నత పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన దేశానికి ఆదర్శమని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లో భాగంగా మంగళవారం పెదపూడి మండలం గండ్రేడు, పుట్టకొండ, శహపురం గ్రామాలలో ఎమ్మెల్యే చేతుల మీదుగా, ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైయస్సార్సీపి ఏర్పడిన 18 నెలల కాలంలోనే, నవరత్నాలు పూర్తి స్థాయిలో ప్రజలకు, అందించడం జరుగుతుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని రీతిలో, ప్రజా సంక్షేమ పథకాలను, అర్హులైన వారందరికీ అందించడంలో, ప్రభుత్వం సఫలమైందన్నారు. అర్హతే ప్రామాణికంగా ఈ ప్రభుత్వంలో ఇంటి పట్టా పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. పట్టాలు రాలేదని ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఇంటి పట్టరాని వారు, లేని వారు స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల వ్యవధిలో ఇంటి పట్టాలు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యులు మోకా సూరిబాబు మాట్లాడుతూ వైయస్సార్ సిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, నేరుగా అర్హుల ఖాతాలో జమ చేసే విధానాన్ని ఏ ప్రభుత్వము చేపట్టలేదని వివరించారు. ప్రజలు విజ్ఞతితో రాబోయే స్థానిక ఎన్నికలలో వైయస్సార్సీపి ని గెలిపించి, మరింత ప్రజాభ్యుదయ సంక్షేమ పథకాలను అందరూ పొందాలని కోరారు. అనంతరం దళితయువ సేన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి శబ్బెళ్ళ కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు, మండల అధ్యక్షుడు గాజింగి వెంకట రమణ, మండల బీసి సెల్ ప్రధాన కార్యదర్శి రాయుడు మురళీ కృష్ణ, పంచాయతీ కార్యదర్శి రాంజీ, కేత శ్రీను, తడాల మణికంఠ, మేడిశెట్టి సత్తిబాబు, అనసూరి దుర్గాప్రసాద్, వైసిపి నాయకులు, కార్యకర్తలు, దళిత యువ సేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#