12:48 AM, 24 Sunday January 2021

సురేష్ కు కిడ్నీ మార్పిడి అయ్యే ఖర్చు నేనే భరిస్తా..

– వై ఎస్ ఆర్ పి మండపేట నియోజక వర్గ ఇంఛార్జి తోట త్రిమూర్తులు

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

సురేష్ కు కిడ్నీ మార్పిడికి అయ్యే ఖర్చు అంతా తానే భరిస్తానని మండపేట నియోజకవర్గ ఇన్చార్జ్ తోట త్రిమూర్తులు హామీ ఇచ్చారు.
రాయవరం గ్రామానికి చెందిన చంద్రమళ్ళ సురేష్ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు, గత నెలలుగా సురేష్ అనారోగ్యం కారణంగా వైద్య పరిషకలు నిర్వహించగా సురేష్ కు 2 కిడ్నీ లు పాడయ్యాయని వైద్యులు నిర్ధారించారు. తప్పని సరిగా కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. కిడ్నీ దానం చేసేందుకు మెనమామ ముందుకు రావడంతో శాస్త చికిత్సకు సుమారు 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.  అంత సొమ్ము చెల్లించడం తలకు మించిన భారం గా భావించి రాయవరం గ్రామానికి చెందిన వై సి పి నాయకులు తేతలి సుబ్బిరామి రెడ్డి నీ సంప్రదించగా మంగళవారం చెల్లూరు గ్రామాలలో పేదలందరికీ ఇల్లు పంపిణీ కార్యక్రమంలో తోట త్రిమూర్తులు ను కలిసి తన భాదను వెళ్ళబుచుకునాడు . విషయం గ్రహించిన తోట  మానవత్వంతో సురేష్ కు కిడ్నీ మార్పిడి అయ్యే ఖర్చు తానే భరిస్తామని హామీ ఇచ్చి వారి కుటుంబానికి మనోధర్యం కలిగించారు. ఈ కిడ్నీ మార్పిడికి సహకరిస్తున్న తోట త్రిమూర్తులు లకు కుటుంబం రుణపడి వుంటుందని సురేష్ కుటుంబీకులు అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రమళ్ళ రామకృష్ణ,  రాయవరం యవ చైతన్య సభ్యులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#