10:42 AM, 14 Thursday January 2021

సొంతింటి కలను నెరవేరుస్తున్నాం

– ఏలేశ్వరం మండలం పలు గ్రామాల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన
– ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్

ఏలేశ్వరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

పేదలకు సొంతింటి కలను నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ అన్నారు. ఏలేశ్వరం మండలం మర్రివీడు, జడ్డంగి అన్నవరం, తూర్పులక్ష్మీపురం, రమణయ్యపేటలో లబ్ధిదారులకు నివేశన స్థలాల పట్టాలు సోమవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పర్వత మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా సొంత గూడు లేక అవస్థలు పడుతున్న పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పేదలకు నూతన గృహాలను నిర్మిస్తున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో జనం సొమ్ము దోచుకుని పచ్చ చొక్కా పథకాలు అందిస్తే నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి కుల, మత, పార్టీలకతీతంగా గ్రామాల్లో అర్హత కలిగిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తుంటే టిడిపి నాయకుల గుండెల్లో భయం పట్టుకుని తమ పార్టీ ఉనికి కోసం దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేస్తూ ప్రభుత్వాలపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు రజనీ కుమారి, ఎంపీడీవో డి ఎన్ రత్నకుమారి, ఆర్ఐ ఎస్ పొనాల్, వైసిపి ఏలేశ్వరం మండలం ఇన్చార్జి బదిరెడ్డి గోవిందు, నాయకులు గొల్లపల్లి బుజ్జి, అలమండ చలమయ్య, సిడగం వెంకటేశ్వరరావు, సఖిరెడ్డి బుజ్జి, పల్లెల బ్రహ్మం, గంటేటి కిషోర్ కుమార్, కొండ పల్లి వెంకటేశ్వరరావు, కాలారి సత్తిబాబు, రామశెట్టి వెంకటరమణ, బిశెట్టి అప్పలరాజు, వీఆర్వోలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#