04:07 AM, 2 Tuesday March 2021

స్వచ్చందంగా , స్వేచ్ఛగా , నిర్భయంగా ఓటు వినియోగించుకోవాలి…

– ఓటర్లకు రాయవరం ఎస్సై పి వి యస్ యస్ ఎన్ సురేష్ సూచన
– ఎన్నికల దృష్ట్యా రాయవరం గ్రామంలో వివిధ పార్టీ నాయకులు గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వచ్చందంగా ,స్వేచ్ఛగా,  నిర్భయంగా వినియోగించుకోవాలని రాయవరం ఎస్సై పి వి యస్ యస్ ఎన్ సురేష్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 13 న ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మండల కేంద్రమైన రాయవరం దళిత వాడలో శుక్రవారం రాత్రి  ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు.
గ్రామాల్లో కొత్త వ్యక్తుల కదలికలపై ఆరా తీశారు. అనుమానాస్పదంగా ఎవరైనా కొత్తవారు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై సూచించారు. ఈ నేపద్యంలో ఎస్సై మాట్లాడతూ గ్రామంలో ఎన్నికల దృష్ట్యా ఎటువంటి అల్లర్లకు పాల్పడవద్దనిగ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అందరూ సహకరించాలనిఎటువంటి గొడవలు ,అల్లర్లను సృష్టించిన వాటిని ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గ్రామంలో ఓటర్లు లు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అయన కోరారు.
ఎన్నికల సమయంలో ఎవరైనా అల్లర్లు , అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా , ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్టు తెలిసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఓటర్లు మద్యం , నగదు వంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఏ పార్టీ నాయకులైనా వస్తువులను బహుకరిస్తే ప్రజలు తిరస్కరించాలని పేర్కొన్నారు. ఎవరైనా తమ వద్ద ఎక్కువ మొత్తంలో నగదు ఉండి రవాణా చేయాల్సి వస్తే ముందుగా మండల ఎన్నికల అధికారులకు సమాచారం ఇవ్వాలని , తద్వారా వారి నుండి రసీదు పొందాలని , లేనిపక్షంలో తనిఖీల్లో పట్టుబడితే నగదును సీజ్ చేయడం జరుగుతుందని ఎస్సై సురేష్ తెలిపారు. నాటుసారా, మద్యం రవాణా చేసినా ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లు మద్యం సేవించి వస్తే ఓటు హక్కు తిరస్కరించబడుతుందని ఎస్సై సురేష్ తెలిపారు. ఈ విషయాలను ప్రతిఒక్కరూ గమనించాలని ఎస్సై కోరారు. గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ సి పి నాయకులు పడాల కామలరెడ్డి, చంద్రమళ్ళ రామ కృష్ణ, మందపిల్లి కొండల రావు, తెలుగు దేశం పార్టీ మాజీ సర్పంచ్ పాలంగి చిన్నబాబు వివిధ పార్టీ నాయకులు, మహిళలు తదితరలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#