01:40 AM, 8 Monday March 2021

స్వచ్ఛ సర్వేక్షన్ లో మెరుగైన ర్యాంకింగ్ సాధించేందుకు ప్రజలు సహకరించాలి

◘ కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

స్వచ్ఛ సర్వేక్షన్ లో ప్రజలందరూ భాగస్వాములై కాకినాడ నగరం మెరుగైన ర్యాంకింగ్ సాధించేందుకు సహకరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కోరారు. మంగళవారం కాకినాడలో స్థానిక 41వ డివిజన్ లో పారిశుధ్య నిర్వహణను కమిషనర్ పరిశీలించారు. డివిజన్లో ప్రజలు తడి, పొడి చెత్తను వేరు వేరుగా ఇవ్వడం పట్ల పారిశుద్ధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ లో పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా ఉందని, ప్రజల్లో తడి చెత్త, పొడి చెత్త పై హానికర వ్యర్థాల పై కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. చెత్తను వేరుచేయని వారినుండి వ్యర్ధాలను సేకరించవద్దని పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించారు. ప్రజలంతా వ్యర్ధాలను తడి చెత్త, పొడి చెత్త గా వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు  అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా చేయడం వలన వ్యర్ధాలను ప్రాసెసస్ చేసే సమయం మరియు ఇందనం కూడా ఆదా అవుతుందని తెలిపారు. పర్యటనలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, డస్ట్ బిన్ ల వినియోగం పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ ఫర్జానా, ప్లానింగ్ సెక్రటరీ నిహారిక, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#