05:35 PM, 28 Thursday January 2021

స్వామీ వివేకానందుని బోధనలు యువతకు ఆదర్శం… రామచంద్రపురం డిఎస్పి ఎం బాలచంద్రారెడ్డి…

స్వామీ వివేకానందుని బోధనలు యువతకు ఆదర్శం…
రామచంద్రపురం డిఎస్పి ఎం బాలచంద్రారెడ్డి…

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

స్వామీ వివేకానందుని బోధనలు యువతకు ఆదర్శమని రామచంద్రపురం డిఎస్పి ఎం బాలచంద్రారెడ్డి పేర్కొన్నారు. మండలంలో పసలపూడి గ్రామంలో గ్రామస్తుల అద్వర్యంలో స్వామీ వివేకానుందుని 158 వ జయంతి ఉత్సవాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రామానికి రామచంద్రపురం డిఎస్పి ఎం బాలచంద్రారెడ్డి ముఖ్యాతిధిలుగా పాల్గొని మాట్లాడతూ స్వామీ వివేకానందుడు యువతను మేల్కొలిపే సందేశాలను అనేకం ఇచ్చారని తెలిపారు. విద్యతోనే విజ్ఞానత ఏర్పడుతుందని తెలిపారన్నారు. ప్రతీ ఒక్కరూ మంచి నడవడికను అలవాటు చేసుకోవాలని పటిష్టవంతమైన దేశ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలన్నారు. స్వామీ వివేకానందుడు బలమే జీవనం-బలహీనతే మరణం అని అన్నారని, భారత ప్రభుత్వం ఆ మహనీయుని జన్మదినాన యువజనోత్సవాలు నిర్వహించుతున్నదని తెలిపారు. తోలతగా డి ఎస్పి స్వామీ వివేకానందుని విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం సి ఐ శ్రీనివాస్, వై యస్ ఆర్ సి పి నాయకులు త్రినాద్ రెడ్డి, గరికి పాటి సూర్యనారాయణ, తాడి శ్రీనివాస్ రెడ్డి, చింత సుబ్బారెడ్డి, కర్రి రామారెడ్డి, చింత రామ్మేహన్ రెడ్డి, తాడి సత్యనారాయణ రెడ్డి, సత్తి గంగాదర్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#