అమలాపురంలో ఘోరం: మైనర్ బాలికకు రహస్య అబార్షన్ యత్నం!
ప్రభుత్వ డాక్టర్ ప్రైవేట్ దందా.. నిబంధనలు గాలికి! తల్లిదండ్రులకు తెలియకుండా ఆసుపత్రిలో అడ్మిషన్.. రంగంలోకి పోలీసులు. అమలాపురం - విశ్వం వాయిస్ న్యూస్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో మానవత్వాన్ని, వైద్య వృత్తిని నిలువునా ముంచేసే ఒక సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పచ్చని కోనసీమలో ప్రభుత్వ జీతం తింటూ, ప్రైవేట్ ఆసుపత్రి ముసుగులో కొందరు చేస్తున్న చీకటి దందా బట్టబయలైంది. ఒక మైనర్ బాలిక జీవితంతో ఆడుకుంటూ, చట్టవిరుద్ధంగా అబార్షన్ (గర్భస్రావం) చేయడానికి సిద్ధపడిన ఓ ప్రభుత్వ వైద్యురాలి...