ఎన్నికల కోడ్ నేపథ్యంలో నవంబర్ 23న పీజీఆర్‌ఎస్ రద్దు.. డిసెంబర్ 2 వరకు ఎన్నికల నియమావళి అమలు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున సోమవారం (నవంబర్ 23) నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ రెండు విడతల్లో జరగనున్న నేపథ్యంలో డిసెంబర్ 2వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.పీజీఆర్‌ఎస్ కార్యక్రమం రద్దయినప్పటికీ...