ఓటరు జాబితా ప్రత్యేక పునర్విమర్శకు ప్రజలు సహకరించాలి
పలు విషయాలను వెల్లడించిన ఎమ్మార్వో ఎం.వి. సాయి ప్రసాద్ రాయవరం,విశ్వంవాయిస్ న్యూస్: రాయవరం మండలంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా పునర్విమర్శ (ఎస్‌ఐఆర్-2026) కార్యక్రమానికి ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని మండల తహశీల్దార్ (ఎమ్మార్వో) ఎం.వి. సాయి ప్రసాద్ గురువారం ప్రకటన ద్వారా తెలిపారు. ఓటరు జాబితా సమగ్రతను కాపాడటం, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, మరణించిన వారు, నకిలీ మరియు అనర్హులైన ఓటర్ల...