కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్య.. భర్త వేధింపులే కారణమని బంధువుల ఆరోపణ
జగ్గంపేట, విశ్వం వాయిస్: పెళ్లై కనీసం నెల రోజులు కూడా గడవకముందే ఒక నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన తీవ్ర విషాద ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. కిర్లంపూడి మండలం గోనేడ గ్రామానికి చెందిన సత్యంశెట్టి వెంకటలక్ష్మి అనే వివాహిత భర్త వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. **వివరాల్లోకి వెళితే..** గోనేడ గ్రామానికి చెందిన వెంకటలక్ష్మికి, పెద్దాపురం మండలం మర్లవ గ్రామానికి చెందిన గాది కోటేశ్వరరావుతో గత ఏప్రిల్ 25వ తేదీన వివాహం జరిగింది. అయితే, పెళ్లైన కొద్ది రోజులకే భర్త కోటేశ్వరరావు ఆమెను మానసికంగా...