కే.గంగవరం జడ్పీ హైస్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా ‘తిరంగా ర్యాలీ’
విశ్వం వాయిస్ న్యూస్ కే.గంగవరం:కే.గంగవరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో శుక్రవారం "హర్ ఘర్ తిరంగా" భారీ ర్యాలీ అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పితాని శ్రీనివాస్ (ఇంచార్జ్) అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ర్యాలీ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం నుండి ప్రారంభమై, గ్రామ పురవీధుల మీదుగా ప్రధాన బస్టాండ్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని, "వందేమాతరం", "భారత్ మాతాకీ జై" అంటూ...