VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 10:40 pm Posted by : khandavelli567@gmail.com

కోరుకొండలో ఘనంగా “విశ్వం వాయస్” కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక.

– పత్రిక పరిజ్ఞానానికి పరీక్ష- పలువురికి చిరు సత్కారాలు.
– సరస్వతి విద్యానికేతన్ అధినేత గంగాధర్ కు కృతజ్ఞతలు.

కోరుకొండ జూన్ 10 (విశ్వం వాయిస్ న్యూస్)

కోరుకొండ సరస్వతి విద్యా నికేతన్ లో విశ్వం వాయస్ నాలుగు జిల్లాల కుటుంబసభ్యుల ఆత్మీయ కలయిక కోరుకొండ రిపోర్టర్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం కోరుకొండ సరస్వతి విద్యానికేతన్ లో నిర్వహించిన విశ్వం వాయస్ ఆత్మీయ కలయికకు సంస్థ అధినేత సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ సమాజానికి ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడుతున్న పత్రికారంగం అన్ని విధాల కుంటుపడుతుందని, పత్రికారంగాన్ని సక్రమంగా నడిపించవలసిన బాధ్యత పోలీస్, రాజకీయ,న్యాయ వ్యవస్థతో పాటు ప్రతి రిపోర్టర్ కి ఉందన్నారు. ప్రతి పాత్రికేయుడు మారుతున్న వ్యవస్థకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని, బాధితుల తరఫున భరోసాగా నిలవాలన్నారు. ప్రతి పాత్రికేయుడు నిత్య విద్యార్థి అని, మారుతున్న కాలానికి అనుగుణంగా సమస్యలపై అవగాహన పెంపొందించుకొని, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కోరుకొండ సరస్వతి విద్యానికేతన్ అధినేత పెనకటి గంగాధర్ గ్రామీణ స్థాయిలో పేద విద్యార్థులకు ఐఐటి విద్యతో పాటు తక్కువ ఫీజులతో విద్యను అందించడం, రాజమహేంద్రవరం జిల్లా వ్యాప్తంగా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవ కార్యక్రమాల పురస్కరించుకొని విశ్వం వాయిస్ అధినేత సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గంగాధర్ కు పూలమాలవేసి సాల్వ్తో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా నేటి సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పాత్రికేయులు పత్రిక రంగంపై విలువలతో కూడిన అవగాహన పెంపొందించు కోవాలన్నారు. సమాజంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తూ, బాధితులు తరఫున భరోసాగా నిలవాలన్నారు. అనంతరం తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పోలవరం జిల్లాల స్టాఫ్ రిపోర్టులను పూలమాల వేసి సాల్వ్తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధినేత సునీల్ కుమార్, సబ్ ఎడిటర్ చంద్ర, నాలుగు జిల్లాల స్టాఫ్ రిపోర్టర్ రత్న కిషోర్, గోవింద్, వెంకటేష్, చిట్టిబాబు, ఆయా జిల్లాల రిపోర్టర్లు పాల్గొన్నారు.