గంగవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏకగ్రీవంగా స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నిక

గంగవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్.ఎమ్.సి ) ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. పాఠశాలలో మొత్తం 252 మంది ఓటర్లు ఉండగా, ఎన్నికల ప్రక్రియకు 185 మంది తల్లిదండ్రులు హాజరయ్యారు. వారి సమక్షంలో ఎస్.ఎమ్.సి సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.చైర్‌పర్సన్‌గా తుమ్మూరి లలిత, వైస్ చైర్‌పర్సన్‌గా దూడల సత్య శ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎన్నికైన ఎస్.ఎమ్.సి సభ్యులు పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం,...