చేయూత టీచర్ ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత పితాని శ్రీనివాస్‌కు ఘన సత్కారం
కె. గంగవరం:విశ్వం వాయిస్ న్యూస్ విద్యార్థుల అభ్యసనలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, పాఠశాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న సోషల్ ఉపాధ్యాయులు శ్రీ పితాని శ్రీనివాస్ గారు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అందించిన టీచర్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా జెడ్.పి.హెచ్.ఎస్ కె. గంగవరం పాఠశాల ఆవరణలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి.వి. సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో శ్రీ పితాని శ్రీనివాస్ గారిని ఘనంగా సత్కరించారు.విద్యార్థులకు సోషల్ సబ్జెక్ట్‌ను బోధించడంతో పాటు, లిసనింగ్ , స్పీకింగ్, రీడింగ్,...