Newspaper Banner

టిప్పర్ లారీ రూపంలో కంబాలించిన మృత్యువు ఆరుగురు మృతి…

  •  తెల్లవారుజామునే చిదిగిపోయిన ఉపాధి కూలీల బతుకులు
  • ఘటనా స్థలంలో నలుగురు మృతి.. ఆసుపత్రిలో ఇద్దరు…
  • కాకినాడ రూరల్ కొవ్వూరు బైపాస్ రోడ్డు లో ప్రమాదం……
  • బైపాస్ రోడ్ లో అడ్డు అదుపు లేకుండా అతివేగంతో టిప్పర్లు హల్ చల్ .. పట్టించుకోని రవాణా శాఖ….
  • ఉన్న చోట నెట్వర్క్ ప్రాబ్లం తో ఫేస్ రికగ్నైజేషన్ కోసం బైపాస్ రోడ్డు కి ఉపాధి కూలీలు….
  • సమాచారం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే తనయుడు పంతం సందీప్., మరియు కూటమి నాయకులు..,.
  • సొంత ఖర్చుల తో అంత్యక్రియలకు లక్ష రూపాయల సహాయం అందజేత….
  • అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా…
ప్రమాదానికి కారణమైన టిప్పర్ వాహనం

కాకినాడ,రూరల్ క్రైమ్  (విశ్వం వాయిస్ న్యూస్ ) :  కాకినాడ రూరల్ కొవ్వూరు బైపాస్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఉపాధి మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు మహిళ కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం తెల్లవారు జాము ప్రాంతంలో అత్యంత వేగంతో టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అలాగే ఆ సమయంలో టిప్పర్ డ్రైవర్ మందు తీసుకున్నాడని తెలియజేశారు.

 

కూలీలకు హాజరుకు ఉపయోగించే ఫేస్ యాప్కు నెట్ అందకపోవడంతో పనులు చేసుకుంటున్న వారిని ఫీల్డ్ అసిస్టెంట్ నమోదు కోసం రోడ్డు పక్కకు పిలిచినట్లుగా వారు చెప్పారు. 20 మంది పూర్తయిన తర్వాత వారు వెళ్లిపోగా మిగిలిన ఆరుగురికి యాప్ స్కాన్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు అక్కడి స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో చీడిగ ప్రాంతానికి చెందిన వాసంశెట్టి సత్యవతి, పాలిక కృష్ణవేణి, కాదా చిట్టెమ్మ, చెల్లూరి అన్నవరంలు మృతిచెందగా పాలిక నాగమణి, మట్టపర్తి అరుణ కుమారిలకు గాయాలయ్యాయి. ఉదయమే ఈ ప్రమాదం జరగడంతో ఈ వార్త దాహంలో చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. గత మూడు నెలల కాలంలో కేవలం హైవే ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోయిన అనేక కుటుంబాలు వీధిన పడ్డాయి. కాకినాడ చుట్టుపక్కల గ్రామాల కూడలి హైవేగా మారడం గ్రామాలకు ఆనుకుని ఉన్నాయి. ఈ హైవే అరకొరగా పూర్తయిన రవాణా సౌకర్యానికి వీలు లేకపోయినా భారీ వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు నిర్వహించడం వల్ల అవగాహన లోపం వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల అనేక పేద కూలి పని చేసుకునే కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి ప్రమాదాల బారినపడి రోడ్డును పడుతున్నాయి..

రోడ్డు భద్రత భవనాల శాఖ అధికారులు ఈ హైవేలపై పర్యవేక్షణ లోపం ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం హైవేపై జీబ్రా క్రాసింగ్లు వంటివి ఏర్పాటు చేయకపోవడం వల్ల హైవే రహదారిపై భారీ ప్రమాదాలు జరుగుతున్నవి.

 

జిల్లా పోలీసులు గ్రామాల అనుకుని ఉన్న హైవేలపై ఏర్పాటు చేసిన పెట్రోలింగ్ వాహనాలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఎప్పటికప్పుడు నేత్రాలు పర్యవేక్షణ లోపం వల్ల రాత్రులు తెల్లవారులు రాత్రి సమయాలలో భారీ వాహనాలు అత్యంత వేగంతో ఈ రహదారులపై రాకపోకలు నిర్వహించడం తెల్లవారుజామున అదే వేగంతో రావడం వల్ల ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నావని స్థానికులు తెలుపుతున్నారు. హైవేలపై పోలీస్ హైవే పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులో ఉండేలా జిల్లా పోలీసు వారు సహకరించాలని అనేకమంది కోరుతున్నారు.

భారీ వాహనాలు అలాగే లారీలు టిప్పర్లు వంటి ఇసుక మట్టి గ్రావెల్ వంటివి రాత్రులు రవాణా చేస్తున్న వాహనాలపై రవాణా శాఖ అధికారులు పట్టించుకోకపోవడం రాత్రి సమయాలలో వాహనాలను తనిఖీలు చేయకపోవడం వల్ల కనీసం లైసెన్సు ఇన్సూరెన్స్ లేని వాహనాలు హైవేలపై అత్యంత వేగంతో తిరుగుతూ ప్రమాదాలు చేస్తున్నారని హైవే ని ఆనుకుని ఉన్న గ్రామస్తులు తెలుపుతున్నారు ఎప్పటికైనా రవాణా శాఖ వారు మేల్కొని రాత్రి సమయాలలో తిరిగే వాహనాలను తనిఖీలు చేసి సురక్షితంతో కూడిన వేగంతో రవాణా సౌకర్యాలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని రవాణాశాఖ అధికారులను కోరుతున్నారు..

ప్రతి సంవత్సరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రమాదాల శాతం తగ్గిందని పేపర్ పై చెప్పడమే తప్ప ప్రతినెల హైవేలపై అనేక ప్రమాదాల బారిన పడి అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని దీనిపై పోలీసు వారు ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రమాదాలు నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని హైవేలకు ఆనుకుని అనుసంధానంగా ఉన్న గ్రామస్తులు జిల్లా ఎస్పీని కోరుతున్నారు. మృతులంతా పేదలు, వ్యవసాయ కార్మికులు కావడంతో వారి కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది.