VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 9:12 pm Posted By : VISWAM VOICE DAILY

టీడీపీ లో చేరిన నేలటూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు.

 


మండపేట టౌన్, విశ్వంవాయిస్ న్యూస్, మే 17…

 

కపిలేశ్వరపురం మండలం, నేలటూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు వనుం గోపాలకృష్ణ, వనుం కిరణ్ కుమార్ లు ఆ గ్రామ టీడీపీ గ్రామశాఖ అధ్యక్షులు రుద్రాక్షుల సోమేష్ ఆధ్వర్యంలో ఆదివారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశంపార్టీ లో చేరారు. వీరి ఇరువురికి ఎమ్మెల్యే వేగుళ్ళ టీడీపీ కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వల్లూరి శ్రీనివాస్ చౌదరి, కడలి గోవిందరాజు, అల్లం శ్రీను, వాసా దుర్గారావు, రుద్రాక్షుల వెంకట గణేష్, గెద్దాడ చిన్నబాబు, కుక్కల బాలశ్రీను, కుక్కల నాగరాజు లు పాల్గొన్నారు.