తూర్పుగోదావరి జిల్లా జెడ్పీటీసీ సభ్యురాలు కాదా పద్మా

✍️ విలేకరి: khandavellisuniljohnkumar (రాయవరం, తూర్పు గోదావరి) రాయవరం మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు కాదా పద్మా ప్రభాకరరావు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. సాధారణ కుటుంబం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి టీడీపీ బలోపేతానికి కాదా దంపతులు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవకాశం లభించిందని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. పద్మా ప్రభాకరరావు ఎంపిక పట్ల రాయవరం మండల ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కూడా ఆమెకు అభినందనలు తెలిపారు.