తెదేపా కార్యాలయంలో ఘనంగా బొడ్డు జన్మదిన వేడుకలు.
కోరుకొండ మే 17 (విశ్వం వాయిస్ న్యూస్) తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రాజమహేంద్రవరం రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం బూరుగుపూడి గేటు వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోరుకొండ,రాజానగరం, సీతానగరం మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుని బొడ్డు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోరుకొండ స్వయంభు శ్రీలక్ష్మి నరసింహస్వామికి బొడ్డు పేరున ప్రత్యేక పూజలు...