VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 7:38 pm Posted By : VISWAM VOICE DAILY

నది శుభ్రతకు శ్రీకారం చుట్టిన గోదావరి స్లిమ్మర్స్ క్లబ్ సభ్యులు

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూ స్:

పవిత్ర గోదావరి నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీజీసీ సభ్యులు, గోదావరి స్విమ్మర్స్ క్లబ్ గౌరవాధ్యక్షులు రౌతు సూర్యప్రకాశరావు అన్నారు.ఆదివారం స్థానిక పుష్కరాల రేవు వద్ద గోదావరి నదిని శుభ్రపరిచే కార్యక్రమానికి స్విమ్మర్స్ క్లబ్ సభ్యులు శ్రీకారం చుట్టారు. పడవల సహాయంతో గోదావరి అడుగుభాగంలో ఉన్న చెత్త, నాచు,గడ్డిని తొలగించారు.నాలుగు ఐదు గంటల పాటు సభ్యులు కష్టపడి గోదావరిలో పేరుకుపోయిన చెత్తను తొలగించి ఒడ్డున వేశారు. ఈ కార్యక్రమంలో రౌతు సూర్య ప్రకాష్ రావు పాల్గొని సభ్యులతో పాటు ఆయన కూడా శ్రమదానం చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాజమండ్రి పేరు చెబితే మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది పవిత్ర గోదావరి నది అని, అలాంటి నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఒకప్పుడు గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జిపై రైలు వెళ్తుంటే గలగల పారే గోదావరి శబ్దం వినడానికి ఎంతో హాయిగా ఉండేదని రౌతు అన్నారు. పవిత్ర గోదావరిలో పాత బట్టలు, పూజలు చేసిన తర్వాత కొన్ని వస్తువులు వేసి నదిలో ఇబ్బందికర వాతావరణం కలుగజేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటికి, సాగునీటికి జీవనాధారమైన గోదావరి నదిని పరిరక్షించుకోవడానికి మేధావులు, మఠాధిపతులు, పండితులు తమ గళాన్ని విప్పగలిగితే ప్రజల్లో చైతన్యం వస్తుందని రైతు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ప్రతి ఏటా గోదావరి స్విమర్స్ క్లబ్ తరఫున గోదావరి నదిని శుభ్రం చేస్తుంటామని,, క్లబ్లో ఉన్న సభ్యులందరూ ఇందులో పాల్గొని శ్రమిస్తారని అన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రూ 450 కోట్ల రూపాయలతో గోదావరిలో మురుగునీరు కలవకుండా డెడికేటెడ్ ఛానల్ నిర్మాణానికి ప్రతిపాదనలు జరిగాయన్నారు.వాటర్ వర్క్స్ లో నీటిని శుద్ధి చేసేందుకు ఉండే రా పాయింట్ ఎగువన డ్రైనేజీ వ్యవస్థ ఉండడం ఆ నీటిని తిరిగి శుద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం విచారకరమన్నారు. ఈ విషయాన్ని తాను ఎమ్మెల్యేగా ఉండగా రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేశారని అన్నారు.ఆయన మరణం వల్ల ఆ ప్రణాళిక అక్కడే ఆగిపోయిందన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో అప్పటి మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు,ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంతో చొరవ చూపించి సమస్యను పూర్తిగా నిర్మూలించడానికి శాయశక్తులా కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్విమర్స్ క్లబ్ ప్రెసిడెంట్ గుబ్బల వెంకటరమణ సెక్రటరీ పాలపర్తి దుర్గాప్రసాద్, జాయింట్ సెక్రటరీ చిట్టూరి ఆంజనేయ ప్రసాద్, దుబాయ్ శీను, రాజు, తాతారావు, ఆదినారాయణ, టైలర్ లక్ష్మణరావు, గ్లోబల్ కిషోర్ గోల్డ్ నాగు, ఆర్ వి వి కుమార్, వై.ఎస్.ఆర్ శ్రీను, కుక్క తాతబ్బాయి,ఈగల ప్రసాద్, ఆండ్ర రవి ప్రకాష్, వైవి రంగనాయకులు, ఎల్లప్పనాయుడు, తోట మధు,కోట రమణ, పీటి మాస్టర్ నాగేశ్వరరావు, నీమ్ చంద్ జైన్, బ్యాంకు రామారావు, బ్రహ్మ గిరీష్, ఎల్ ఐ నాయుడు తదితరులు పాల్గొన్నారు.