జీవనదిపై విషపు నీడ!

కలుషిత జలాలతో రాయవరం విలవిల.. భూగర్భ జలాలు విషతుల్యం! కులాలు, పార్టీల గొడవల్లో పడి ప్రజాసమస్యను గాలికొదిలేసిన స్థానిక నాయకత్వం! (తూర్పుగోదావరి జిల్లా, రాయవరం - విశ్వం వాయిస్ న్యూస్) ఒకప్పుడు తాగునీటికి, పవిత్ర పుణ్యస్నానాలకు కొలువైన తుల్యభాగా నది నేడు స్థానిక పాలకుల నిర్లక్ష్యానికి, అధికారుల పట్టరానితనానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. హానికరమైన రసాయన వ్యర్థాలు, పారిశ్రామిక మురుగునీరు యథేచ్ఛగా నదిలోకి ప్రవహిస్తుండటంతో నది కాస్తా కంపుకొట్టే మురికి కాలువగా రూపాంతరం చెందింది. కంటిముందే సర్వస్వం నాశనమైపోతున్నా అటు అధికారులు గానీ, ఇటు...