ప్రతిరోజూ అరగంట నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు: వాకర్స్ క్లబ్ జిల్లా గవర్నర్ తోలేటి సూర్యనారాయణ
ఉదయపు నడక ఆరోగ్యానికి వరం లాంటిదని, ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం అరగంట పాటు నడవడం అలవాటు చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని వాకర్స్ క్లబ్ జిల్లా గవర్నర్ తోలేటి సూర్యనారాయణ అన్నారు. ఆదివారం ద్రాక్షారామ మార్కెట్ యార్డులో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ద్రాక్షారామ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయపు నడకలో పాల్గొనే వారి ఆరోగ్య పరిరక్షణకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారానికి ఒకసారి అమృతహారం అందించడం,...