ప్రమాదవశాత్తూ గోదావరిలో మునిగి వ్యక్తి మృతి.
గండిపోశమ్మ ఆలయ సమీపంలో ఘటన. దేవీపట్నం, విశ్వంవాయిస్ న్యూస్ : పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ గండి పోశమ్మ ఆలయం స్నానాల ఘాట్ వద్ద ఆదివారం చోటుచేసుకున్న విషాద ఘటన భక్తులను కలచివేసింది. గండేపల్లి మండలం కె.గోపాలపురం గ్రామానికి చెందిన గోపాల సతీష్ (25), తండ్రి నాగేశ్వరరావు, తన స్నేహితులతో కలిసి అమ్మవారి దర్శనానికి వచ్చాడు. దర్శనానికి ముందు గోదావరిలో పవిత్ర స్నానం చేసేందుకు ఇద్దరు స్నేహితులతో కలిసి నదిలోకి దిగగా ప్రమాదవశాత్తు కాలుజారి లోతైన నీటిలో పడిపోయి గల్లంతయ్యాడు.స్నేహితులు, స్థానికులు కేకలు...