బలహీనపడనున్న ‘అక్వాన్’ తుపాను.. ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్ విడుదల

✍️ విలేకరి: K Sunil John (కాకినాడ అర్బన్, ఆంధ్రప్రదేశ్) దక్షిణ ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో 'అక్వాన్' తుపాను కేంద్రీకృతమై ఉంది. ఒడిశా మీదుగా పయనిస్తున్న ఈ తుపాను రాబోయే 3 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. ఆ తర్వాతి 6 గంటల్లో ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారనుందని ఆర్టీజీఎస్ – ఏపీఎస్డీఎంఏ (20-11-2026, ఉదయం 11 గంటలకు) వెల్లడించింది. తుపాను సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రజలు 'మనమిత్ర' వాట్సాప్ సేవలను వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు. ఇందుకోసం 9552300009...