VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 7:46 pm Posted By : VISWAM VOICE DAILY

బొడ్డు జన్మదినాన్ని పురస్కరించుకొని కామిశెట్టి మజ్జిగ పంపిణీ.


కోరుకొండ మే 17 (విశ్వం వాయిస్ న్యూస్) తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రాజమహేంద్రవరం రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి 51వ జన్మదిన వేడుకలు కోరుకొండ మండలంలో రాజానగరం నియోజక వర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం బొడ్డు వెంకటరమణ చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు కామిశెట్టి దొరబాబు( మీసాల దొరబాబు) కోరుకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద పాదచారులకు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ తమ పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోధించేలా కోరుకొండ స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఆయనకు అందజేయాలన్నారు.